IPL 2025: బెంగుళూరుకు బిగ్ షాక్.. చిత్తు చేసిన గుజరాత్ !

by velandi.Saikiran |   (  Updated:2025-04-02 17:47:04  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది.

IPL 2025: బెంగుళూరుకు బిగ్ షాక్.. చిత్తు చేసిన గుజరాత్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాక్ ఇస్తూ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) గ్రాండ్ విక్టరీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ గుజరాత్ టైటాన్స్. అన్ని విభాగాల్లో చక్కగా రాణించిన గుజరాత్ టైటాన్స్... 17.5 ఓవర్లలోనే... కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు మాత్రమే చేసింది.


అయితే ఆ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి... గుజరాత్ టైటాన్స్ చేదించగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్ అలాగే జోస్ బట్లర్ ఇద్దరు దుమ్ము లేపారు. సాయి సుదర్శన్ 49 పరుగులు చేయగా బట్లర్ 73 పరుగులతో నాటౌట్ గా పిలిచాడు. చివర్ లో రూథర్ ఫర్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేసి.. రఫ్పాడించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన గుజరాత్ పాయింట్స్ టేబుల్ లో... నాలుగో స్థానంలో నిలిచింది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ ( punjab kings) మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. దింతో పాయింట్స్ టేబుల్ లో RCB డౌన్ ఫాల్ షురూ అయిందని చర్చ మొదలైంది.

Next Story