వివాదంలో గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌.. సోష‌ల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌.. ఆ వెంట‌నే డిలీట్‌..

by Disha Web Desk 13 |
వివాదంలో గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌.. సోష‌ల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌.. ఆ వెంట‌నే డిలీట్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: గుజ‌రాత్ టైటాన్స్ బౌలర్ య‌శ్ ద‌యాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండ‌డంతో య‌శ్ ద‌యాల్ వెంటనే డిలీట్‌ చేశాడు. ల‌వ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని య‌శ్ ద‌యాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కావాల‌ని చేయ‌లేద‌ని పొర‌బాటు జ‌రిగిన‌ట్లు ఒప్పుకుంటూ త‌న త‌ప్పును క్షమించాల‌ంటూ పోస్ట్‌ పెట్టాడు.

''పొర‌బాటున ఆ క‌థ‌నాన్ని పోస్ట్ చేశాను ద‌య‌చేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, క‌మ్యూనిటీ ప‌ట్ల నాకు గౌర‌వం ఉంది.'' అంటూ రాసుకొచ్చాడు. ఒక మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాట‌ర్ రింకూ సింగ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో య‌శ్ ద‌యాల్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఐదు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు.



Next Story