- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GT VS RCB: రెచ్చిపోతున్న బ్యాటర్లు.. భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2026 (IPL-2026) మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీకి వెంకటేష్ అయ్యర్ (19 రన్స్, 7 బంతుల్లో) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కాగిసో రబాడ బౌలింగ్‌లో అవుట్ కావడానికి ముందే అతను జట్టు స్కోరును పరిగెత్తించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఇద్దరూ కలిసి పవర్‌ప్లేలో చెలరేగిపోయారు. కేవలం 6 ఓవర్లలోనే జట్టు స్కోరును 76 పరుగులకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో 43 పరుగులు (25 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్) చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. పడిక్కల్ కూడా 30 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు.
హోల్డర్ డబుల్ స్ట్రోక్.. కోలుకున్న బెంగళూరు
ఆ తర్వాత గుజరాత్ బౌలర్ జేసన్ హోల్డర్ (Jason Holder) ఒకే ఓవర్లో కోహ్లీ, పడిక్కల్‌లను అవుట్ చేసి ఆర్‌సీబీని దెబ్బతీశాడు. దీంతో 3 కీలక వికెట్లు కోల్పోయి 94 పరుగుల వద్ద కష్టాల్లో పడిన దశలో రజత్ పాటిదార్, కృనాల్ పాండ్య జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (49* పరుగులు), కృనాల్ పాండ్య (43* పరుగులు) క్రీజులో ఉన్నారు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో పాటిదార్ రెండు సిక్సర్లు, కృనాల్ ఒక సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ ముందు భారీ స్కోరు ఉంచే దిశగా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిన జట్టు క్వాలిఫైయర్-2 ఆడాల్సి ఉంటుంది.






