IND VS PAK: కొలంబోకు చేరుకున్న భార‌త జ‌ట్టు

by velandi.Saikiran |   (  Updated:2026-02-13 20:45:39  IST  )

వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా భార‌త్, శ్రీలంకలో ప‌ర్య‌టించింది. ఈ మేర‌కు ఘ‌న స్వాగ‌తం భార‌త ప్లేయ‌ర్ల‌కు ల‌భించింది.

IND VS PAK: కొలంబోకు చేరుకున్న భార‌త జ‌ట్టు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 లో ( T20 World Cup) భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ నేపద్యంలో తాజాగా శ్రీలంకకు చేరుకుంది ఇండియన్ టీం.

కొలంబో చేరుకున్న భారత జట్టు

వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ( India), పాకిస్తాన్ ( Pakistan) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో కొలంబో చేరుకుంది భారత జట్టు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఘన స్వాగతం పలికింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ జట్టులో ఇటీవల గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అలాగే కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్ శర్మ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరు పాకిస్తాన్ తో ఆడ బోతున్నారని తెలుస్తోంది. కాగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో... వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉందట. రేపటి రోజున 70% నుంచి 80 శాతం వరకు వర్షం పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది జరిగితే మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

Next Story