- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCBకి కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026 కోసం చిన్నస్వామి స్టేడియంలో 30000 నుండి 35000 మంది ప్రేక్షకులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కెఎస్‌సిఎను ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ విషయంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 నేపథ్యంలో హోమ్ గ్రౌండ్ గా చిన్న స్వామి స్టేడియాన్ని యథావిధిగా వాడుకోవచ్చని పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు పర్మిషన్స్ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అయితే ఒకే ఒక కండీషన్ పెట్టింది కర్ణాటక ప్రభుత్వం.
కేవలం 35,000 మందికి మాత్రమే పర్మిషన్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinna Swamystadium) వేదికగా మ్యాచ్ లు జరిగితే, కేవలం 35,000 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇస్తామని వెల్లడించిందట. అంతకంటే ఎక్కువ సామర్ధ్యాన్ని అనుమతించడానికి వీలులేదని పేర్కొంది. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేడియం కెపాసిటీ 40,000 అయినప్పటికీ కేవలం 35,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని వివరించింది.
2025 ఐపీఎల్ సమయంలో బెంగళూరు ( RCB) విజయోత్సవ ర్యాలీలో విషాద సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. RCB విజయోత్సవ ర్యాలీలో అంచనాలకు మించి జనాలు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది బెంగుళూరు అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో ఈసారి హోమ్ గ్రౌండ్ చిన్న స్వామి వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోవు అని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు కర్ణాటక సర్కార్ మాత్రం అనుమతులు ఇచ్చింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట లో 11 మంది బెంగళూరు ఫ్యాన్స్ మరణించగా, వాళ్ల కుటుంబాలను విరాట్ కోహ్లీ, కర్ణాటక సర్కార్, ఆర్సీబీ యాజమాన్యం ఆదుకున్నాయి.






