టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. మహమ్మద్ షమీ సర్జరీ విజయవంతం

by Kema Shiva Kumar |

ఇటీవలే వన్డే వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత పేసర్ మహమ్మద్ షమీ క్రికెట్‌కు దూరమయ్యాడు.

టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. మహమ్మద్ షమీ సర్జరీ విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే వన్డే వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత పేసర్ మహమ్మద్ షమీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఆతడు కాలి మడమ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీ ఆదేశాల మేరకు కాలి మడమకు సర్జరీ చేయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా సోషల్‌ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశాడు. ‘మడమ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. నేను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురుచూస్తున్నా. మళ్లీ క్రికెట్ ఆడేందుకు కొంత సమయం పడుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అదేవిధంగా ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. అయితే, ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story