రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. విద్యుత్ ఛార్జీలపై డిస్కంల కీలక నిర్ణయం

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అయిన TGSNPDCL , TGPDCL తమ వార్షిక ఆదాయ అవసరాల వివరాలు, టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి దాఖలు చేశాయి.

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. విద్యుత్ ఛార్జీలపై డిస్కంల కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి విద్యుత్ చార్జీల పెరుగుదలపై కీలక అప్ డేట్ వచ్చింది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అయిన TGSNPDCL , TGPDCL తమ వార్షిక ఆదాయ అవసరాల (ARR) వివరాలు, టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (TGERC)కి దాఖలు చేశాయి. ఇందులో 2026-27 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచవద్దని డిస్కమ్ లో నిర్ణయించాయి. ఈ మేరకు ఎలక్షన్ కోడ్ ముగియగానే డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ నోటిఫికేషన్ ఇచ్చి TGERC సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది. అలాగే బహిరంగ విచారణ తర్వాత టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలవుతాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తక్కువ రేట్లకే విద్యుత్ అందిస్తుంది. అలాగే గృహ జ్యోతి పథకంలో భాగంగా అర్హులకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉచితి విద్యుత్ వల్ల డీస్కంలపై భారం పడుతుందని, త్వరలోనే ఛార్జీలు పెంచే అవకాశం ఉందని అనేక వార్తరు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అలాంటి వార్తలకు.. TGSNPDCL , TGPDCL తాజా నిర్ణయంతో చెక్ పెట్టాయి.

Next Story