- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా అభిషేక్ శర్మ
భారత టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), మహిళల జట్టు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) సెప్టెంబర్ నెలకు గాను ఏసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), మహిళల జట్టు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) సెప్టెంబర్ నెలకు గాను ఏసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. ఆసియా కప్ (Asia Cup)లో, ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే సిరీస్‌లో వారు అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. 25 ఏళ్ల ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌లలో 44.85 సగటు, 200ల స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాట్స్‌మన్ ఆసియా కప్‌లో టోర్నమెంట్ ఆటగాడిగా ఎంపికై టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించాడు.
కాగా, అభిషేక్ తన సహచర ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett)లను అధిగమించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఐసీసీ (ICC) అవార్డు గెలుచుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుందని అన్నారు. ముఖ్యమైన మ్యాచ్‌లలో విజయాలు సాధించడంలో తన పాత్ర ఉండటం సంతోషంగా ఉందన్నారు. కష్టతరమైన పరిస్థితుల్లో విజయాలు సాధించగల జట్టులో తాను భాగం కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. టీ20ల్లో మా జట్టు ఇటీవలి రికార్డులతో జట్టు సభ్యులు ఏకతాటి నిలుస్తూ అద్భుత విజయాలు సాధిస్తున్నారనే దానికి నిదర్శనమని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.






