క్రీడాభిమానులకు తీపికబురు.. 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-15 14:20:53  IST  )

దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు గుడ్ న్యూస్.

క్రీడాభిమానులకు తీపికబురు.. 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపిక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు గుడ్ న్యూస్. 2030 కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) నిర్వహణకు భారత్ ఎంపికైంది. అయితే, ఇటీవలే దేశంలో కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహిస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్ సర్కార్ (Gujarat Government) భారత ప్రభుత్వం సూచన మేరకు కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) చీఫ్ క్రిస్ జెన్కిన్స్‌ ప్రతిపాదనలు పంపారు. అందులో అహ్మదాబాద్‌ (Ahmadabad)ను హోస్ట్ సిటీగా, సపోర్టింగ్ సిటీలుగా భువనేశ్వర్, న్యూఢిల్లీలను పేర్కొన్నారు. అయితే, ఆగస్ట్ 13న న్యూఢిల్లీలో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్ (SGM)లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏకగ్రీవంగా కామన్‌వెల్త్ బిడ్‌కు అంగీకారం తెలిపింది. అదేవిధంగా ఆగస్ట్ 27న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ బిడ్ సమర్పణకు ఆమోద ముద్ర వేసింది. అనంతరం యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ శాఖ ఆదేశాల మేరకు ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌కు ముందు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ బిడ్ దాఖలు చేశారు. తాజాగా, కామన్‌వెల్త్ స్పో్ర్ట్స్ ఎవాల్యూయేషన్ కమిటీ (CSA) భారత్ బిడ్‌ ఓకే చెప్పింది. దీంతో 2030లో అహ్మదాబాద్ హోస్ట్ సిటీగా కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్‌లో దాదాపు 72 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని సమాచారం.

Next Story