క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ICC అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-19 14:51:38  IST  )

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.

క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ICC అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ టోర్నీకి హోస్ట్‌లుగా జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ఈవెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత్, యూఎస్ఏ మధ్య జరగనుంది. టోర్నీ మొత్తంలో 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.. 16 జట్లు పోటీలో ఉన్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ హరారే స్టేడియంలో జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఈసారి కూడా వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి టీమ్ గ్రూప్‌లోని మిగతా టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్-A, గ్రూప్-Dలలో టాప్-3లో నిలిచిన జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. మిగతా రెండు గ్రూపులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. రెండు సూపర్-6 గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.

Group-A: భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్.

Group-B: జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్.

Group-C: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక.

Group-D: టంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా.

Next Story