Gongidi Trisha: పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.. గొంగిడి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ (ICC Women's Under-19 World Cup)లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదగొట్టిన తెలంగాణ (Telangana) తేజం గొంగిడి త్రిష (Gongidi Trisha) ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి (Shamshabad International Airport) చేరుకున్నారు.

Gongidi Trisha: పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.. గొంగిడి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ (ICC Women's Under-19 World Cup)లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదగొట్టిన తెలంగాణ (Telangana) తేజం గొంగిడి త్రిష (Gongidi Trisha) ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి (Shamshabad International Airport) చేరుకున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు, బంధవులు ఆమెకు ఘటన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీవితంలో తాను ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం లభించినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా శ్రమించి ఉమెన్స్ సీనియర్ టీమ్‌ (Women's Senior Team)లో చోటు సాధిండమే లక్ష్యంగా పెట్టుకుంటానని అన్నారు.

ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌ (ICC Women's Under-19 World Cup Final)లో సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని సహజ శైలిలోనే ఆడానని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి ఎవరైనా ప్రతి మ్యాచ్‌లో మా పాత్ర ఏంటనే విషయాన్ని మనసులో పెట్టుకుని మాత్రమే తాను ప్రతి సారి బరిలోని దిగానని పేర్కొన్నారు. తన ప్రతి విజయం వెనుక కుంటుబ సభ్యులు, బంధువుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని అన్నారు. ముఖ్యంగా తన తండ్రి కృషి ఎన్నటికీ మరువలేనని భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తన సహచర క్రీడాకారిణీ ధృతి కూడా చాలా మంచి ప్లేయర్ అని.. కానీ, తనకు ఆడే అవకాశం లేదని గొంగిడి త్రిష అన్నారు.

Next Story