Gongidi Trisha: హైదరాబాద్ చేరుకున్న గొంగిడి త్రిష.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

by Kema Shiva Kumar |

ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ (ICC Women's Under-19 World Cup) విన్నర్ తెలంగాణ (Telangana) ముద్దు బిడ్డలు గొంగిడి త్రిష (Gongidi Trisha), ద్రితి కేసరి (Dhriti Trivedi) ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయాని (Shamshabad International Airport)కు చేరుకున్నారు.

Gongidi Trisha: హైదరాబాద్ చేరుకున్న గొంగిడి త్రిష.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ (ICC Women's Under-19 World Cup) విన్నర్ తెలంగాణ (Telangana) ముద్దు బిడ్డలు గొంగిడి త్రిష (Gongidi Trisha), ద్రితి కేసరి (Dhriti Trivedi) ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయాని (Shamshabad International Airport)కి చేరుకున్నారు. ఈ మేరకు వారికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jaganmohan Rao) పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా త్రిష కుటుంబ సభ్యులు, బంధవులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని సందడి చేశారు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అసామాన్య ప్రతిభను కనబరిచింది. ముఖ్యంగా ఫైనల్ త్రిష 44 పరుగులు చేసిన ఏకంగా 3 వికెట్లను పడగొట్టింది.

కాగా, ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ (ICC Women's Under-19 World Cup) లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ (ICC) ఎంపిక చేసిన టీమ్‌లో నలుగురు భారత (India) ప్లేయర్లకు చోటు దక్కింది. అదిరే ప్రదర్శన చేసిన తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongidi Trisha)తో పాటు కమలిని (Kamalini), ఆయూషి (Ayushi), వైష్ణవి (Vaishnavi) ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఈ టోర్నీలో 147 స్ట్రైక్‌ రేట్‌తో 309 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికైన త్రిష.. స్కాట్లాండ్‌ (Scotland)పై మెరుపు సెంచరీ చేసింది. ఈ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. టోర్నీ మొత్తం త్రిషకు సపోర్ట్‌గా నిలిచిన మరో ఓపెనర్‌ కమలిని 143 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ (England)తో సెమీస్‌లో కమలిని (56) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు వైష్ణవి (17 వికెట్లు), ఆయూషి (14 వికెట్లు) బంతితో అదరగొట్టారు. కైలా రేనెక్, జెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్‌ (ఇంగ్లాండ్‌), కోయ్‌మి బ్రే (ఆస్ట్రేలియా), చమోది (శ్రీలంక), పూజ మహతో (నేపాల్‌) కూడా ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. 12వ ప్లేయర్‌గా నిని (దక్షిణాఫ్రికా)ఎంపికైంది. ఇక జట్టు కెప్టెన్‌గా కైలా రేనెక్‌‌ను నిర్ణయించారు.

Next Story