- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. ప్రత్యేకంగా అభినందించిన CM రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మహిళల అండర్-19 ప్రపంచ కప్(Women's Under-19 World Cup)లో సత్తా చాటిన భద్రాచలం యువతి గొంగడి త్రిష(Gongadi Trisha) కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మహిళల అండర్-19 ప్రపంచ కప్(Women's Under-19 World Cup)లో సత్తా చాటిన భద్రాచలం యువతి గొంగడి త్రిష(Gongadi Trisha) కలిశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రికెటర్ త్రిషకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్‌లో మెంబర్‌గా ఉన్న మరో తెలంగాణకు చెందిన యువతి ధృతి కేసరికి 10 లక్షల రూపాయల, అండర్ 19 వరల్డ్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్ నౌషీన్‌కు, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది.
రెండేళ్ల కిందట తొలి ట్రోఫీని దక్కించుకున్న టీమ్‌ఇండియా(Team India).. రెండోసారి కూడా కప్పును నిలబెట్టుకుంది. అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి ఇటు బ్యాటుతో, అటు బంతితో చెలరేగిపోతున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష.. ఫైనల్లో (44 నాటౌట్; 33 బంతుల్లో 8×4) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. 309 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలవడమే కాక.. 7 వికెట్లు కూడా తీసిన త్రిష (Gongadi Trisha)నే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా వరించింది.






