- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ లిఫ్టర్ ప్రమాదవశాత్తు మృతి
పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ట్రైనింగ్ ఫెసిలిటీస్‌లో సౌకర్యాలు మెరుగు పరచాలని పలువురు కోరుటున్నారు.
- జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మెడపై పడిన రాడ్
- అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన యశ్తికా ఆచార్య
- కోచ్‌కు స్వల్ప గాయాలు
- జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన యశ్తికా
దిశ, స్పోర్ట్స్: భారత క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని బికనేర్‌లో యువ మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య (17) ఒక ప్రమాదంలో మృతి చెందింది. జిమ్‌లో తన ట్రైనర్ సహాయంలో ప్రాక్టీస్ చేస్తుండగా 270 కిలోల రాడ్ మెడపై ప్రమాదవశాత్తూ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే రాడ్ పడిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఆమె ట్రైనర్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇంత వరకు ఫిర్యాదు చేయలేదని నయా షహర్ ఎస్‌హెచ్‌వో విక్రమ్ తివారి చెప్పారు. పోస్టుమార్టమ్ అనంతరం బుధవారం ఆమె మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, పవర్ లిఫ్టింగ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న యశ్తిక మరణం క్రీడా లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో ఆమె స్వర్ణ పతకం సాధించింది. ఏనాటికైనా అంతర్జాతీయ వేదికలపై రాణించాలని, ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆమె కలలు కన్నది. కానీ 17 ఏళ్లకే మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ట్రైనింగ్ ఫెసిలిటీస్‌లో సౌకర్యాలు మెరుగు పరచాలని పలువురు కోరుటున్నారు.






