- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2036 ఒలింపిక్స్‌లో వందకు పైగా మెడల్స్ సాధించడమే లక్ష్యం: ఐసీసీ చైర్మన్ జే షా
భారతదేశం క్రీడారంగంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు సిద్ధమవుతోందని ఐసీసీ చైర్మన్ జే షా ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం క్రీడారంగంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు సిద్ధమవుతోందని ఐసీసీ చైర్మన్ జై షా (ICC Chairman Jay Shah) ఆశాభావం వ్యక్తం చేశారు. సూరత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను భారత్ (అహ్మదాబాద్) దక్కించుకుందని, అయితే మన లక్ష్యం అంతటితో ఆగకూడదని అన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలను కూడా భారతదేశానికి తీసుకురావడమే తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 2024 ఒలింపిక్స్‌లో సాధించిన 8 మెడల్స్ సరిపోవని, 2036 నాటికి కనీసం 100 మెడల్స్ సాధించే స్థాయికి మన అథ్లెట్లు ఎదగాలని పిలుపునిచ్చారు. ఇందులో కనీసం 10 మెడల్స్ గుజరాత్ క్రీడాకారులే సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.
క్రికెట్ విజయాల గురించి ప్రస్తావిస్తూ.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో మనం హృదయాలను గెలుచుకున్నా ట్రోఫీని గెలవలేకపోయామని, కానీ 2024లో హృదయాలతో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా గెలుస్తామని తాను గతంలోనే చెప్పానని, అది నిజమైందని గుర్తుచేశారు. అలాగే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. క్రీడల పట్ల ప్రధాని మోదీ చూపిస్తున్న శ్రద్ధ వల్ల దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఇది భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలకు బాటలు వేస్తుందని జే షా ధీమా వ్యక్తం చేశారు.






