- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs GT : చెలరేగిన వైభవ్.. గుజరాత్ పై రాజస్తాన్ గ్రాండ్ విక్టరీ
గుజరాత్ పై రాజస్తాన్(RR vs GT) గ్రాండ్ విక్టరీ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ పై రాజస్తాన్(RR vs GT) గ్రాండ్ విక్టరీ సాధించింది. కళ్ళముందు కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ.. ఏ మాత్రం బెదరకుండా.. గుజరాత్ బౌలర్లను ఉతికి పారేసి అద్భుతమైన విజయం సాధించారు రాజస్తాన్ బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ లక్ష్యాని రాజస్తాన్ ముందు ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్తాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Viabhav Suryavanshi) వచ్చీరాగానే గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వరుస ఫోర్లు, సిక్సులు బాదుతూ బౌలర్స్ కు చుక్కలు చూపించాడు.
కేవలం 35 బాల్స్ లోనే సెంచరీ నమోదు చేశాడు ఈ 14 ఏళ్ల చిచ్చర పిడుగు. 7 ఫోర్లు, 11 సిక్సులతో చెలరేగిపోయి.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన 2వ ఆటగాడిగా వైభవ్ రికార్డ్ సాధించాడు. యశస్వి జైస్వాల్ 70, రియాన్ పరాగ్ 32 కూడా భారీ పరుగులు చేసి.. నిర్ణీత టార్గెట్ ను 15.5 బాల్స్ లోనే చేధించారు.






