Glenn Maxwell: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. హిందూ సాంప్రదాయంలో భార్య సీమంతం..

by Disha Web Desk 13 |
Glenn Maxwell: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. హిందూ సాంప్రదాయంలో భార్య సీమంతం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. మాక్స్‌వెల్‌కు 2022 ఇయర్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు, ఇండియాకు చెందిన వినీ రామన్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆయన భార్య వినీ రామన్ సోషల్ మీడియా వేదికగా హిందూ సాంప్రదాయంలో జరిగిన సీమంతానికి చెందిన ఫోటోలను పంచుకుంది. వినీ రామన్ తమిళనాడుకు చెందిన అమ్మాయి కాబట్టి వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. తమిళనాడు హిందూ సంప్రదాయం ప్రకారమే వినీ రామన్‌ సీమంతం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుక ఫొటోస్‌ను వినీ రామన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా అవి కాస్తా వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా వినీ రామన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తన భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఫొటోకి ఫోజులిచ్చాడు.

‘మేము సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడానికి నేను ఆనందిస్తున్నాను’ అంటూ గ్లెన్ మాక్స్‌వెల్ తన భార్యకు రాసిన ప్రత్యేక లేఖను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది వినీ రామన్. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు దూరమైన గ్లెన్ మాక్స్‌వెల్ ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్ ద్వారా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3 టీ20 మ్యాచ్‌లు, 5 వన్డేలు ఆడనుంది. దీని తర్వాత భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడనున్నాడు.



Next Story

Most Viewed