వారిద్దరు నన్ను ఒత్తిడి పెట్టట్లేదు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |

కెప్టెన్‌గా తనపై ఎలాంటి అంచనాలు, ఒత్తిడి లేదని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

వారిద్దరు నన్ను ఒత్తిడి పెట్టట్లేదు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : కెప్టెన్‌గా తనపై ఎలాంటి అంచనాలు, ఒత్తిడి లేదని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తాజాగా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌తో చిట్‌చాట్‌లో గిల్ పలు విషయాలు వెల్లడించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లతో తనపై ఏమైనా అంచనాలు ఉన్నాయా? అని చాలా సార్లు డిస్కస్ చేశానని చెప్పాడు. తనపై ఎలాంటి అంచనాలు లేవని వారు తెలిపాడు. తాను చేయలేని పనిని చేస్తానని వారు అనుకోవడం లేదన్నాడు. నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటానని గంభీర్, అజిత్ అగార్కర్ నమ్ముతున్నారని చెప్పాడు. అయితే, ఆటగాడిగా తనపై తనకు అంచనాలు ఉన్నాయన్నాడు. కెప్టెన్‌గా ప్రతి ప్లేయర్ భద్రతగా, సంతోషంగా ఉండే సంస్కృతిని నిర్మించాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 20 నుంచి తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది.


Next Story