'త్వరగా కోలుకోండి కెప్టెన్'

by Ajay Maddhiboyina |

ఐపీఎల్ ప్రారంభం నాటికి సంజూ శాంసన్ రికవరీ అయ్యే అవకాశఆలు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడతాడని రాయల్స్ జట్టు వర్గాలు చెప్పాయి.

త్వరగా కోలుకోండి కెప్టెన్
X

- ట్వీట్ చేసిన రాజస్థాన్ రాయల్స్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 సీజన్ నాటికి తమ కెప్టెన్ సంజూ శాంసన్ కోలుకోవాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం 'ఎక్స్' వేదికగా 'త్వరగా కోలుకోండి కెప్టెన్' అంటూ పోస్టు పెట్టింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ఐదో మ్యాచ్‌లో సంజూ శాంసన్ వేలికి గాయమైంది. దీంతో ఆ గాయానికి సంజూ సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం వైద్యులు ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో.. క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్‌ను సమయం దగ్గర పడుతుండటంతో అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ త్వరగా కోలుకోండి కెప్టెన్ అంటూ ట్వీట్ చేసింది. సంజూ శాంసన్ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో అతను తర్వాత మెగా ఈవెంట్ ఐపీఎల్‌ను టార్గెట్ చేశాడు. సర్జరీ నుంచి నెల రోజుల్లో కోలుకుంటాడని తెలిసింది. ఐపీఎల్ ప్రారంభం నాటికి సంజూ శాంసన్ రికవరీ అయ్యే అవకాశఆలు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడతాడని రాయల్స్ జట్టు వర్గాలు చెప్పాయి.

Next Story