తల్లి ఐసీయూలో ఉండగానే.. ఇంగ్లండ్‌కు గంభీర్

by Phanindra |

తల్లి ఇంకా ఐసీయూలో ఉండగానే ఇంగ్లండ్‌కు వెళ్లాలని గంభీర్ నిర్ణయించుకున్నాడట. టీం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తల్లి ఐసీయూలో ఉండగానే.. ఇంగ్లండ్‌కు గంభీర్
X

దిశ, స్పోర్ట్స్: ఫ్యామిలీ ఎమర్జెన్సీతో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. మంగళవారం నాడు ఇంగ్లండ్ చేరుకోనున్నట్లు సమాచారం. తల్లి సీమా గంభీర్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ మొదలైన రోజునే గంభీర్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. అయితే తొలి టెస్టుకు ముందే జట్టుతో చేరాలని గంభీర్ భావిస్తున్నాడట. దానికితోడు ప్రస్తుతం సీమా పరిస్థితి కొంత మెరుగైందని, అందుకే మంగళవారం నాడు తిరిగి ఇంగ్లండ్ బయలుదేరేందుకు గంభీర్ సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


అయితే సీమా ఇంకా ఐసీయూలోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రమాదం తప్పిందని, కానీ మానిటరింగ్ కోసం ఆమెను ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు నిర్ణయించారట. ఇలాంటి సమయంలో గంభీర్ కఠినమైన నిర్ణయం తీసుకొని, జట్టుతో చేరేందుకు ఇంగ్లండ్ బయలుదేరుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. రోహిత్, కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో ఇంగ్లండ్ సిరీసుపై చాలా ఫోకస్ ఉందనే చెప్పాలి. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, గంభీర్ జోడీ ఏ విధంగా జట్టును ముందుకు తీసుకెళ్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story