- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత హెడ్ కోచ్ గంభీర్ షాకింగ్ నిర్ణయం..!
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం, హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసే యోచనలో గంభీర్ ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు

దిశ, వెబ్ డెస్క్: భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసే యోచనలో గంభీర్ ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన వెంటనే, రాజీనామా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చాలా రోజుల నుంచి గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
భారత జట్టు స్వదేశంలో టెస్టులు ఓడిపోవడానికి కారణం గౌతమ్ గంభీర్ అంటూ సీనియర్ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. అటు ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, టాలెంట్ కుర్రాలను తొక్కేయడం లాంటివి గంభీర్ చేస్తున్నట్లు అశ్విన్ లాంటి క్రికెటర్లు బహిరంగంగానే అంటున్నారు. అయితే ఈ విమర్శలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాజీనామా చేసేందుకు గంభీర్ సిద్ధమయ్యారట. టీ20 ప్రపంచ కప్ పూర్తి కాగానే రాజీనామా చేస్తారని అంటున్నారు. కాగా టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది.






