- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంబినేషన్‌కు తగట్టే తుది జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడిన గంభీర్
ఇటీవల భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా తుది జట్టు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా తుది జట్టు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లను బెంచ్‌కే పరిమితం చేయడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిపై గంభీర్ ఎట్టకేలకు స్పందించాడు. కాంబినేషన్‌కు తగ్గట్టే తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపాడు. గంభీర్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోమవారం సోషల్ మీడియాలో పంచుకుంది. ‘తుది జట్టు ఎంపిక అనేది కోచ్‌గా నాకు కష్టతరమైన పని. కొన్నిసార్లు బెంచ్‌పై నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారు ప్లేయింగ్ 11కు వారు అర్హులని నాకు తెలుసు. కానీ, ఆ మ్యాచ్‌కు ఆ రోజు సరైన కాంబినేషన్‌ను ఎంపిక చేయాలన్న ఆలోచనతో తుది జట్టును సెలెక్ట్ చేస్తాం.’అని గంభీర్ తెలిపాడు.
అలాంటి సమయాల్లో ప్లేయర్లకు అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యమని చెప్పాడు. ‘కమ్యూనికేషన్ నిజాయితీగా, స్పష్టంగా ఉండాలి. నువ్వు ఆడటం లేదని ఏ ప్లేయర్లకైనా చెప్పడం కొన్నిసార్లు చాలా కష్టం. కోచ్‌కు, ప్లేయర్ మధ్య అది కష్టతరమైన సంభాషణ అవుతుంది. ప్లేయింగ్ 11కు అర్హత ఉన్నప్పటికీ ఆడకపోతే ప్లేయర్ కచ్చితంగా నిరాశకు గురవుతాడు. అప్పుడు నిజాయితీతో ముక్కుసూటిగా చెప్పడం తప్ప ఏం చేయలేం.’అని తెలిపాడు. తుది జట్టు చుట్టూ వచ్చే నిరాధారమైన సిద్ధాంతాలను అతను కొట్టిపారేశాడు. డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉందన్నాడు. ‘కోచ్‌కు, తమకు మధ్య సంభాషణ అని కొందరు ప్లేయర్లు అర్థం చేసుకుంటారు. కానీ, జనాలు దీని చుట్టూ సిద్ధాంతాలు అల్లుకుంటారు. మా డ్రెస్సింగ్ రూం చాలా పారదర్శకమైనది. ఇలాంటి డ్రెస్సింగ్ రూమే కావాలని నేను కోరుకుంటా’అని చెప్పుకొచ్చాడు.
ఫిట్‌నెస్ చాలా ముఖ్యం
ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ప్లేయర్లకు గంభీర్ పలు సూచనలు చేశాడు. ప్రపంచకప్ కోసం పూర్తిగా సన్నద్ధం కావాలన్నాడు. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ‘టీ20 ప్రపంచకప్‌ు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. మేము ఇంకా పూర్తిగా సన్నద్ధం కావాలి. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను ప్లేయర్ల అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని తెలిపాడు.
- Tags
- Gautam Gambhir






