ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంటికి గంభీర్.. తొలి టెస్టు ముందే తిరిగొస్తాడా?

by Phanindra |

ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంగ్లండ్ నుంచి గంభీర్ ఇంటికి వచ్చేశాడు. తొలి టెస్టు ముందే తిరిగి లండన్ వచ్చేస్తాడా?

ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంటికి గంభీర్.. తొలి టెస్టు ముందే తిరిగొస్తాడా?
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌‌కు కుర్రజట్టును సిద్ధం చేసే పనిలో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల హుటాహుటిన భారత్‌కు తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లి సీమాకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలోనే గంభీర్ ఉన్నట్టుండి భారత్‌కు తిరిగొచ్చేశాడు. జూన్ 20న ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదలవనున్న సంగతి తెలిసిందే. ఇంటి దగ్గర అంతా సక్రమంగా ఉంటే జూన్ 17న గంభీర్ మళ్లీ ఇంగ్లండ్ చేరుకుంటాడని సమాచారం.


ఇంగ్లండ్ సిరీస్‌కు జట్టును రెడీ చేయడం కోసం టీమిండియా, ఇండియా-ఎ జట్ల మధ్య ఏర్పాటు చేసిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ కూడా శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఇంగ్లండ్‌తో ఆడే జట్టును నిర్ణయించడంలో ఈ మ్యాచ్ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అలాంటి మ్యాచ్ జరుగుతున్న సమయంలో గంభీర్ లేకపోవడం సెలెక్షన్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. గంభీర్ గైర్హాజరీలో అసిస్టెంట్ కోచ్‌ ర్యాన్ టెన్ డస్కాటే, సుతాంషు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. ఈ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ప్రొసీడింగ్స్‌ను పరిశీలించనున్నారు.

Next Story