రెండో టెస్టులో విజయం గంభీర్‌కు లైఫ్‌లైన్.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ గెలవడం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు లైఫ్‌లైన్ లాంటిదని భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా అభిప్రాయపడ్డాడు.

రెండో టెస్టులో విజయం గంభీర్‌కు లైఫ్‌లైన్.. భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ గెలవడం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు లైఫ్‌లైన్ లాంటిదని భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఖన్నా మాట్లాడుతూ.. గంభీర్ హయాంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతేకాకుండా, తొలి టెస్టులోనూ ఇంగ్లాండ్ చేతిలో పరాజయం ఓడిపోయామని, ఈ పరిస్థితుల్లో రెండో టెస్టు విజయం గంభీర్‌కు లైఫ్‌లైన్ లాంటిదని చెప్పాడు. ఈ క్రెడిట్ కచ్చితంగా గిల్, జట్టుకే చెందుతుందన్నాడు. టీ20లో తరహాలో దూకుడు ఆట తీరు భారత్‌కు సహాయపడిందని చెప్పాడు. రెండో టెస్టులో విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్రికెట్‌లో ఏం జరుగుతుందో తెలియదని, శక్తి తగ్గట్టు ఆడితే ఫలితాలు వస్తాయని తెలిపారు.


Next Story