- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియాకు మరో షాక్..2 టెస్టులకు స్టార్ బౌలర్ దూరం !
ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరిగిన తొలి టెస్ట్ లో... గిల్ సేన ( Gill) తేలిపోయింది. చివరి వరకు బాగా

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరిగిన తొలి టెస్ట్ లో... గిల్ సేన ( Gill) తేలిపోయింది. చివరి వరకు బాగా ఆడిన టీమిండియా... ఐదవ రోజు మాత్రం చేతులెత్తేసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది టీమిండియా. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ గిల్ అలాగే గంభీర్లపై సోషల్ మీడియాలో... క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఇద్దరి చేతకానితనం వల్లే టీమిండియా ఓడిపోయిందని మండిపడుతున్నారు.
అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా బౌలింగ్ దిగజం బుమ్రా ( Bumrah)... ఈ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పేర్కొన్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలోనే మధ్యలోనే ఇండియాకు బుమ్రా వెళ్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.
ఈ సిరీస్ లో కేవలం 3 టెస్టులు మాత్రమే బుమ్రా ఆడతాడని గౌతమ్ గంభీర్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అతని వర్క్ లోడ్ మేనేజ్ చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇంకా ఏ రెండు మ్యాచ్ లలో ఆడించాలనేది నిర్ణయం తీసుకోలేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. అయితే నేషనల్ మీడియా కథనం ప్రకారం.. మరో రెండు టెస్ట్ మ్యాచులు ఆడి...బుమ్రా ఇంటికి వచ్చేస్తాడని అంటున్నారు. అతని స్థానంలో హర్షిత్ రానా బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.






