French Open : ఫ్రెంచ్ ఓపెన్‌కు కొత్త క్వీన్.. చాంపియన్‌గా కోకా గాఫ్

by Harish |

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌కు కొత్త క్వీన్ వచ్చేసింది.

French Open : ఫ్రెంచ్ ఓపెన్‌కు కొత్త క్వీన్.. చాంపియన్‌గా కోకా గాఫ్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌కు కొత్త క్వీన్ వచ్చేసింది. ఉమెన్స్ సింగిల్స్ నయా చాంపియన్‌గా అమెరికా సంచలనం కోకా గాఫ్ అవతరించింది. ఫైనల్‌లో వరల్డ్ నం.1 సబలెంకకు షాకిచ్చి టైటిల్ ఎగరేసుకపోయింది. ఆసక్తికరంగా సాగిన టైటిల్ పోరులో గాఫ్ 6-7(5-7), 6-2, 6-4 తేడాతో సబలెంకపై విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోవడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తిన్న గాఫ్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. వరుసగా రెండు, మూడు సెట్లను నెగ్గి విజేతగా నిలిచింది. గాఫ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.


Next Story