వన్డే వరల్డ్ కప్ కోసం బ్లూప్రింట్ రెడీ చేస్తాం: గౌతీ

by Phanindra |

వరల్డ్ కప్ విజయంతో కొత్త ప్రయాణం మొదలైందని గౌతీ అన్నాడు. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ బ్లూప్రింట్ రెడీ చేస్తామన్నాడు.

వన్డే వరల్డ్ కప్ కోసం బ్లూప్రింట్ రెడీ చేస్తాం: గౌతీ
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విజయ గర్వం తలకెక్కించుకోకూడదని, మరింత కష్టపడాలని ఆటగాళ్లకు సూచించాడు. ట్రోఫీ నెగ్గడం గమ్యంలా భావించకుండా, కొత్త ప్రయాణానికి ఆరంభాలా భావించాలన్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో మరింత ఎక్స్‌ప్లోజివ్‌గా ఆడతామని, 300 పరుగుల రికార్డు బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తామని స్పష్టంచేశాడు. ‘మేం ఇంకా 300 టార్గెట్ టచ్ చెయ్యలేదు. ఏదో ఒకరోజు అది కూడా అందుకుంటాం. మేం మరింత నిర్దాక్షిణ్యంగా మారతాం’ అని చెప్పాడు. టోర్నీలో సంజూ ఆడి ఇన్నింగ్సులు చూసిన తర్వాత.. వరల్డ్ కప్ వంటి వేదికపై కూడా తమ ఎగ్రెసివ్ అప్రోచ్ పనిచేస్తుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నాడు.

2027 వరల్డ్ కప్ బ్లూప్రింట్..

అలాగే ఐపీఎల్ 2026 ముగిసే సమయానికి వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌ కోసం కూడా బ్లూప్రింట్ సిద్ధం చేస్తామని గంభీర్ తెలిపాడు. ‘2027 వరల్డ్ కప్‌ కోసం ప్లానింగ్‌ను ఐపీఎల్ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఐపీఎల్ తర్వాత వన్డే వరల్డ్ కప్ జరిగేప్పటికి 25-30 వన్డేలు ఉన్నాయి. ఈ ఫార్మాట్ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆడటం లేదు. సాధ్యమైనంత త్వరగా ప్లానింగ్ స్టార్ట్ చేస్తే మంచిది’ అని వివరించాడు. ఈ టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ ఆడటం అంత సులభం కాదని, కాబట్టి కాంబినేషన్లు సిద్ధం చేసుకోవాలని గంభీర్ చెప్పాడు. ఆ పరిస్థితులకు సరిపోయే ప్లేయర్లను గుర్తించాలని, ఇదంతా సెలెక్టర్లు, కోచ్‌ల పని అన్నాడు. ఐపీఎల్ 2026 ముగిసే సమయానికి వరల్డ్ కప్ కోసం బ్లూప్రింట్ సిద్ధం చేస్తామని దీమా వ్యక్తంచేశాడు.

Next Story