- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ కు షాక్...టీమిండియా కోచ్ గా సెహ్వాగ్?
గౌతమ్ గంభీర్ స్థానంలోవీరేంద్ర సెహ్వాగ్ కు అవకాశం రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు వరుసగా టెస్ట్ సిరీస్ లు కోల్పోతున్న సంగతి తెలిసిందే. సొంత గడ్డపై గతంలో న్యూజిలాండ్, మొన్న దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు వైట్ వాష్ అయింది. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల కారణంగా, సొంతగడ్డపై కూడా భారత జట్టు విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ అంశంపై ఫైర్ అవుతున్నారు. ఇక చాలా మంది అభిమానులు అయితే, కోచ్ పదవిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ స్థానంలో రవి శాస్త్రీని మరోసారి కోచ్‌గా తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది మహేంద్ర సింగ్ ధోనికి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అయితే నేషనల్ మీడియా కథనాల ప్రకారం, టి20 వరల్డ్ కప్ అయిపోయే వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా కొనసాగుతాడట. ఆ తర్వాత అతన్ని తప్పించే ఛాన్స్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అదే జరిగితే గౌతమ్ గంభీర్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కు అవకాశం రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. భారత జట్టుకు గతంలో సుదీర్ఘకాలం పాటు వీరేంద్ర సెహ్వాగ్ సేవలందించాడు. అలాంటివాడు భారత జట్టుకు కోచ్ గా వస్తే, ఫలితాలు బాగుంటాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు చర్చలు చేస్తున్నారట. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.






