ఫిట్‌గా ఉంటే ఆడాల్సిందే.. టీమిండియా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

by Harish |

టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ వర్క్‌లోడ్ వ్యూహంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు చేశాడు.

ఫిట్‌గా ఉంటే ఆడాల్సిందే.. టీమిండియా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ వర్క్‌లోడ్ వ్యూహంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు చేశాడు. ముఖ్యంగా బుమ్రాకు రెస్ట్ ఇవ్వడాన్ని ప్రశ్నించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ..‘బౌలర్లు టెస్టు మ్యాచ్‌లను ఎంపిక చేసుకోవడాన్ని నేను ఇష్టపడను. మీరు ఫిట్‌గా ఉండి అందుబాటులో ఉంటే దేశం కోసం అన్ని మ్యాచ్‌లు ఆడాలి. భారత్ కోసం ఆడటం ముఖ్యం. ఫిట్‌గా లేకుంటే ఆడకండి.’అని గవాస్కర్ ఫైర్ అయ్యాడు. అలాగే, రెండో టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ. ‘బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతన్ని భారత్‌ను గెలిపించగలడు. కానీ, పర్యటనలో ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్‌ను ఎంచుకునే ప్రశ్నే లేదు. తొలి టెస్టు తర్వాత 7-8 రోజుల గ్యాప్ ఉంది. అయినప్పటికీ రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. ఇది ఆమోదయోగ్యం కాదు. గంభీర్‌, గవాస్కర్‌లకు ఆమోదం కావొచ్చు’అని విమర్శించాడు.


Next Story