- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తీరు రోజు రోజుకు వివాదస్పదమవుతోంది. ఆటగాళ్ల భద్రతను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలన్న బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప ఆడతారో?లేదో?తేల్చుకోవాలన్న ఐసీసీ ఆదేశాలను కూడా బీసీబీ లెక్కచేయలేదు. ప్రపంచకప్ ఆడతామని చెబుతూనే.. భారత్‌కు అయితే రాబోమని బంగ్లా క్రికెటఓ బర్డు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాపై ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతునట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీసీబీ మరోసారి ఐసీసీకి లేఖ రాసినట్టు సమాచారం. ఐసీసీకి చెందిన వివాద పరిష్కార కమిటీ డీఆర్‌సీ జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలు, నిబంధనలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే స్వతంత్ర సంస్థ డీఆర్‌సీ. డీఆర్‌సీ తీర్పులు అంతిమమైనవి. తమ సమస్యను లోతుగా పరిశీలించకుండానే ఐసీసీ తిరస్కరించిందని డీఆర్‌సీలో లేవనెత్తాలనేది బీసీబీ ఉద్దేశమని అర్థమవుతుంది. అయితే, బంగ్లా రిక్వెస్ట్‌ను ఐసీసీ రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ.
ఐసీసీ రాజ్యాంగం, డీఆర్‌సీ నిబంధనలను పరిశీలిస్తే.. ఐసీసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలును విచారించే హక్కు డీఆర్‌సీకి లేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్‌లో బంగ్లా మ్యాచ్‌లను భారత్‌లోనే ఉంచడానికి అనుకూలంగా ఐసీసీ డైరెక్టర్ల బోర్డు 14-2తో నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ ఆడకపోతే బంగ్లా దాదాపు రూ.240 కోట్ల ఆదాయం నష్టపోనున్నట్టు విశ్లేషకులు అంచనా వేశారు. బ్రాడ్‌కాస్ట్ షేర్, స్పాన్సర్‌షిప్‌లు, టోర్నమెంట్‌కు సంబంధించిన ఆదాయం నష్టపోనుంది.






