- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అమ్మాయి త్రిషకు అరుదైన గౌరవం
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. టీమిండియా టైటిల్ గెలవడంలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ప్లేయర్లతో కూడిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఆ జట్టులో త్రిషకు చోటు దక్కింది. ఫైనల్‌లో త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 3 వికెట్లు తీయడంతోపాటు 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు భారీ విజయం కట్టబెట్టింది. టోర్నీ మొత్తంగా కూడా ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది ఆమెనే. 7 మ్యాచ్‌ల్లో 309 రన్స్ చేసింది. అలాగే, 7 వికెట్లు కూడా తీసింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుంది. ఐసీసీ జట్టులో త్రిష సహా నలుగురు భారత క్రికెటర్లకు చోటు లభించింది. మరో ఓపెనర్ జి.కమలిని, స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలను ఐసీసీ ఎంపిక చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కమలిని(143) మూడో స్థానంలో ఉండగా.. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వైష్ణవి(17), ఆయుశి శుక్లా(14) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ జట్టుకు సౌతాఫ్రికా కెప్టెన్ కైలా రెనేకె సారథిగా ఎంపికైంది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
గొంగడి త్రిష(భారత్), జెమ్మా బొతా(సౌతాఫ్రికా), డావినా పెర్రిన్(ఇంగ్లాండ్),జి.కమలిని(భారత్),కాయోమ్హే బ్రే(ఆస్ట్రేలియా), పూజ మహటో(నేపాల్),కైలా రెనేకె(కెప్టెన్, సౌతాఫ్రికా), కేటీ జోన్స్(ఇంగ్లాండ్), ఆయుశి శుక్లా(భారత్), చమోడి ప్రాబోదా(శ్రీలంక),వైష్ణవి శర్మ(భారత్), న్తబిసెంగ్ నిని(సౌతాఫ్రికా).






