- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏ క్షణం అయినా హెడ్ కోచ్‌గా గంభీర్ తప్పుకోవచ్చు.. టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ ప్లేయర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గంభీర్ యాటిట్యూడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కుసూటిగా ఉండే గంభీర్ ఎక్కువ కాలం భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉండలేడని అన్నారు. తనకు గంభీర్‌పై వ్యక్తిగతంగా కోపం ఏం లేదని అన్నారు. గౌతమ్ ఒకరి నిర్ణయాల మీద ఆధార పడడు. సొంతంగా ఆలోచించే వ్యక్తి అని అన్నారు. ఏ పని అయినా నిజాయితీతో చేస్తాడని తెలిపారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి జట్టులోని ప్లేయర్లతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
అలాంటి సమయంలోనూ గంభీర్ నిర్మోహమాటంగా మాట్లాడుతాడు కాబట్టి నాకు ఆ అభిప్రాయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. గంభీర్ తన పదవీకాలం పూర్తయ్యేలోపు తప్పకుండా తప్పుకునే చాన్సుంది అని అన్నారు. ఇదిలా ఉండగా.. 2007లో ధోనీ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన వేళ... ఫైనల్లో పాకిస్థాన్‌పై ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది జోగిందర్ శర్మే కావడం విశేషం. కాగా, టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవలే బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ కోచ్‌గా టీమిండియా శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది.