యశస్వి జైశ్వాల్.. ఫ్యూచర్ స్టార్ : సురేశ్ రైనా

by Disha Web Desk 13 |
యశస్వి జైశ్వాల్.. ఫ్యూచర్ స్టార్ : సురేశ్ రైనా
X

న్యూఢిల్లీ: ఐపీఎల్-16లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. తాజా ఇంటర్వ్యూలో సురేశ్ రైనా.. జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ యువ క్రికెటర్ టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతాడని చెప్పాడు. అద్భుతమైన క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. ‘బ్యాట్‌ను శరీరానికి దగ్గరగా ఉంచుకుని ఆడటం అనేది అతని టెక్నిక్. కవర్ డ్రైవ్స్ ఆడేటప్పుడు అతను శరీరాన్ని ఎక్కువగా కదల్చట్లేదు.

దాని వల్ల బలాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకోవచ్చు. చక్కటి ఫుట్ వర్క్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు.’ అని చెప్పుకొచ్చాడు. మొదటి ఆరు ఓవర్లలో క్రీజ్‌లో పాతుకపోయేందుకు చూస్తేనే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడని, ఓపెనర్‌కు ఉండాల్సి గొప్ప లక్షణం ఇదేనని రైనా తెలిపాడు. కాగా, చెన్నయ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 43 బంతుల్లో 77 పరుగులు చేసిన జైశ్వాల్ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.



Next Story

Most Viewed