- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోజు రోహిత్ మ్యాచ్ ఆడి ఉంటే.. రిజల్ట్ వేరేలా ఉండేది: రవిశాస్త్రి
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy), రోహిత్ శర్మ టెస్టు కెరియర్ ముగిసిన విధానం గురించి మాట్లాడారు. ‘ఇటీవల ఐపీఎల్‌లో మ్యాచ్ మధ్యలో నేను రోహిత్ శర్మతో మాట్లాడాను. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తాను టీమిండియా హెడ్ కోచ్ అయ్యి ఉంటే రోహిత్ శర్మను ఆఖరి మ్యాచ్ వరకూ ఆడించేవాడిని. రోహిత్ లాంటి దగ్గజ ఆటగాడిని బెంచ్‌కు పరిమితం చేయడం కరెక్ట్ కాదు. రోహిత్‌ను బెంచ్ పరిమితం చేసే నాటికి ఇంకా సిరీస్ ముగియలేదు. బీజీటీలో(BGT) చివరి మ్యాచ్ రోహిత్ శర్మ ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. కాగా, టెస్టుల్లో 67 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 4301 పరుగులు చేశారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.






