- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rohit Sharma : రోహిత్ శర్మపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ పూర్తిగా లొంగిపోయాడని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

దిశ, స్పోర్ట్స్ : అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ పూర్తిగా లొంగిపోయాడని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రానున్న మ్యాచ్‌ల్లో రోహిత్ మరింత చొరవ చూపాలని కోరాడు. తప్పకుండా టీంఇండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తిరిగి బౌన్స్ బ్యాక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘రోహిత్ టాప్ ఆర్డర్‌లోనే రావాలని కోరుకుంటా. ఆ స్థానంలో అయితేనే రోహిత్ అగ్రెసివ్‌గా ఆడగలడు. అడిలైడ్‌లో రోహిత్ బాడీ లాంగ్వేజ్ చూశాక అతను లొంగిపోయినట్లు అనిపించింది. రోహిత్ ఈ సిరీస్‌లో దూకుడు ప్రదర్శించాలి. గత పదేళ్లుగా భారత్-ఆస్ట్రేలియా వెంటనే కౌంటర్ పంచ్‌లు ఇస్తూ వస్తున్నాయి. ఒక మ్యాచ్ ఓడితే మరో మ్యాచ్ గెలుస్తున్నారు. అయితే జట్టు తమపై విశ్వాసం ఉంచాలి.’ అని రవిశాస్త్రి అన్నాడు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లోనే రావాలని.. రోహిత్ ఓపెనింగ్‌కు వస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల టేబుల్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.






