- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సునీల్ ఛెత్రిని ఎందుకు తీసుకోలేదంటే.. నోరు విప్పిన కొత్త కోచ్ ఖలీద్ జమీల్
సీఏఎఫ్‌ఏ టోర్నీకి సునీల్ ఛెత్రి ఎంపికవ్వలేదు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కొత్త కోచ్ ఖలీద్ జమీల్ వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్: కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత ఫుట్‌బాల్ టీం.. కొత్త కోచ్ ఖలీద్ జమీల్ నేతృత్వంలో సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ కోసం సిద్ధం అవుతోంది. ఆగస్టు 29 నుంచి ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ వేదికలుగా మొదలయ్యే ఈ టోర్నీ కోసం ప్రకటించిన 35 మంది సభ్యుల ప్రాబబుల్స్ జాబితాలో వెటరన్ ప్లేయర్ సునీల్ ఛెత్రికి చోటుదక్కలేదు. ఈ నిర్ణయంపై వస్తున్న విమర్శలపై ఖలీద్ జమీల్ నోరువిప్పాడు. ఈ అంశం గురించి సునీల్‌తో ఇప్పటికే తను మాట్లాడినట్లు ఆయన చెప్పాడు.
‘బారత ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి ఒక రోల్‌మోడల్. అతని కోసం జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మన టీం ఆసియా కప్ క్వాలిఫైయర్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు ఉపయోగపడే టోర్నీ ఆడబోతున్నాం. దీంట్లో కొంతమంది కొత్త ప్లేయర్లను ట్రై చెయ్యాలని అనుకున్నా. అందుకే సునీల్‌ను పక్కనపెట్టాం’ అని ఖలీద్ వివరించాడు. జట్టు కష్టాల్లో ఉన్న కారణంగా తన రిటైర్‌మెంట్ కూడా వెనక్కు తీసుకొని ఆడేందుకు వచ్చిన సునీల్ ఛెత్రికి ఇది అవమానం అని పలువురు అభిమానులు మండిపడుతున్నారు.






