- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. టీమిండియాకు షాక్, కీలక ప్లేయర్‌కు గాయం
ఇంగ్లండ్ (England)తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా (Team India) సన్నద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ (England)తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా (Team India) సన్నద్ధమవుతోంది. శుక్రవారం లీడ్స్ (Leads) వేదికగా వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఇదే సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ-2027 (WTC-2027) కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌లను కూడా ఆడేసింది. ఈ క్రమంలోనే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లు నెట్స్‌లో అవిశ్రాంతంగా సాధన చేసున్నారు. అయితే, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) వేసిన బంతిని కరుణ్ నాయర్ (Karun Nair) డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి వచ్చి అతడి పక్కటెములకు తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియోలు అతడికి ప్రథమ చికిత్సను అందజేశారు. రేపటి తొలి టెస్ట్‌కు కరుణ్ నాయర్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా? అనే విషయంపై భారత జట్టు మెనేజ్‌మెంట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.






