- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. ఆసక్తికరంగా వసీం జాఫర్ ఎంపిక చేసిన భారత తుది జట్టు!
ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) సీజన్ ముగిసింది. ఇక ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు భారత్-ఇంగ్లండ్ (India-England) టెస్టు సిరీస్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూన్ 20 నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ (Five-match Test series) ప్రారంభం కానుంది. తొలిపోరు లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టును (Team India) మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు లభించకపోవడం గమనార్హం.
అయితే, ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు రిటైర్ అయిన నేపథ్యంలో వీరిద్దరి తర్వాత కేఎల్ రాహుల్ జట్టులో అత్యధిక అనుభవం కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్వయంగా ప్రకటించిన జట్టుపై మరింత ఆసక్తి నెలకొంది. 31 టెస్టులు, 2 వన్డేలు ఆడిన జాఫర్ ప్రకారం.. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉంటారు. నంబర్ 3 స్థానం కోసం ఆయన స్పష్టంగా ఎవరిని ఎంపిక చేసుకోవాలో చెప్పలేదు. ఐపీఎల్ 2025లో మెరుపులు మెరిపించిన సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్, వీరిలో ఒకరు ఆ స్థానం కోసం పోటీ పడనున్నారు. ఇక నంబర్ 4 స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ చేస్తాడు. అతనిని అనుసరిస్తూ రిషభ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా స్థానాలను ఆక్రమిస్తారు. నంబర్ 8 స్థానానికి శార్దూల్ ఠాకూర్ లేదా కుల్దీప్ యాదవ్ మధ్య ఒకరిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. జాఫర్ ఎంపిక చేసిన ముగ్గురు ఫాస్ట్ బౌలర్లులలో ప్రసిద్ క్రిష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
వసీం జాఫర్ ఎంపిక చేసిన భారత్ తుది జట్టు:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్య ఈశ్వరన్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్/కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
కాగా, ఇది అధికారిక జట్టు కాదని, వసీం జాఫర్ అభిప్రాయంగా ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి.






