- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR VS RCB: ఎట్టకేలకు హోం గ్రౌండ్ లో RCB తొలి విజయం

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఏడాదిలో సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియంలో... ఓడిపోతారన్న సెంటిమెంట్ ను చెరిపి వేస్తూ రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ను చేజేతుల పోగొట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. మొన్న ఢిల్లీ, లక్నో చేతిలో చివరి వరకు వచ్చి ఓడిపోయినట్లుగానే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో.... విఫలమైన రాజస్థాన్ రాయల్స్ మరో దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు నష్టపోయి 194 పరుగులు మాత్రమే చేసింది.
చివరలో తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు
బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్లు ముందుగా బాగా ఆడి... చివరి వరకు వచ్చిన తర్వాత తేలిపోయారు. మ్యాచ్ గెలుస్తుంది అన్న సమయంలో... రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. యశస్వి జైస్వాల్ 49 పరుగులు, దృవ్ జురెల్ 47 పరుగులు, రియాన్ పరాగ్ 22, నితీష్ రానా 28 పరుగులు చేసినప్పటికీ.. చివరి వరకు నిల్వలేకపోయారు. అటు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా... కాస్త క్లిక్ అయి ఉంటే మ్యాచ్ గెలిచేది. దీంతో మరోసారి చేజింగ్ లో ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్.
దుమ్ము లేపిన కోహ్లీ, పడిక్కల్
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోరే చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే దేవాదత్ పడక్కల్ ఇద్దరు దుమ్ము లేపారు. ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో రెండు సిక్సర్లతో పాటు 8 బౌండరీలు ఉన్నాయి. 166 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు కోహ్లీ. పడక్కల్... కూడా 27 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీ ఉన్నాయి. మరో ఓపెనర్ సాల్ట్ 26 పరుగులు చేయగా టీమ్ డేవిడ్ 23 పరుగులు. కెప్టెన్ రజత్ ఒక్క పరుగుగే అవుట్ కాగా జితేష్ శర్మ 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.






