- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు
by Phanindra |
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫిన్ అలెన్.

X
దిశ, స్పోర్ట్స్: కివీస్ యంగ్ ఓపెనర్ ఫిన్ అలెన్ తన సత్తా చూపించాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2025 తొలి మ్యాచులోనే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున ఆడుతున్న అతను కేవలం 51 బంతుల్లోనే 151 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ ఇన్నింగ్సులో 19 సిక్సర్లున్నాయి. దీంతో ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ (18 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ఫిన్ ఈ మ్యాచులో కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అంతేకాదు 49 బంతుల్లో 150 పరుగులు చేసి టీ20 చరిత్రలో వేగవంతమైన 150 స్కోరు నమోదు చేశాడు. దీంతో ఈ జట్టు 20 ఓవర్లలో 269/5 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది.
Next Story






