- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో ఫించ్ అరుదైన రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో అత్యధిక జట్లకు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో తొమ్మిది జట్లకు ఫించ్ ప్రాతినిధ్యం వహించాడు. శుక్రవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్‌రైడర్స్ తరపున ఫించ్ బరిలోకి దిగడంతో ఈ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 2010లో రాజస్తాన్ రాయల్స్, 2011-12 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్, 2013లో పుణే వారియర్స్, 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్, 2016,17లో గుజరాత్ లయన్స్, 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఫించ్ ఆడాడు.
- Tags
- top stories
Next Story






