- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మరోసారి ఈ దాయాదుల పోరును చూడబోతున్నాం. అయితే, ఆ మ్యాచ్ క్రికెట్‌లో కాదు.. హాకీలో. పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో ఆగస్టు 19న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల, మహిళల హాకీ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) బుధవారం ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు ప్రపంచకప్ జరగనుంది. ఆగస్టు 15న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో తలపడనుంది. 17న ఇంగ్లాండ్‌తో, 19న పాక్‌తో ఆడనుంది. ఇక, భారత మహిళల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో చైనాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 16న జరగనుంది. 18న సౌతాఫ్రికాతో, 20న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
Next Story






