- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా ప్రపంచకప్ 2026: అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మెరవనున్న బాలీవుడ్ నటి
అంతర్జాతీయ క్రీడా వేదికపై ప్రముఖ బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహీ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ క్రీడా వేదికపై ప్రముఖ బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహీ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జూన్ 12, 2026న ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ (FIFA World Cup) టోర్నీ ప్రారంభ వేడుకల్లో ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు మే 9న (నేడు) ఈవెంట్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
టొరంటో వేదికగా అట్టహాసంగా వేడుకలు..
కెనడాలోని టొరంటోలో ఉన్న BMO ఫీల్డ్ (BMO Field) వేదికగా జూన్ 12వ తేదీన ఈ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ అతిపెద్ద గ్లోబల్ స్పోర్టింగ్ ప్లాట్‌ఫామ్‌పై నోరా ఫతేహీ తనదైన నృత్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఆమె అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ తారలతో కలిసి..
ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొనే గ్లోబల్ స్టార్ల జాబితాను అధికారికంగా ప్రకటించారు. టొరంటోలో జరిగే ఈవెంట్‌లో నోరా ఫతేహీతో పాటు అలనిస్ మోరిస్సెట్ (Alanis Morissette), అలెసియా కారా, ఎలియానా, జెస్సీ రేయెజ్, మైఖేల్ బబుల్, సంజయ్, వెగెడ్రీమ్, విలియం ప్రిన్స్ తదితర అంతర్జాతీయ పాప్, సంగీత ప్రముఖులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మరోవైపు, అమెరికాలో జరిగే ప్రారంభ వేడుకల్లో గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ అయిన అనిట్టా, కేటీ పెర్రీ, లీసా, రెమా, టైలా వంటి వారు పాల్గొంటారు. విభిన్న దేశాల సంగీతం, సంస్కృతుల కలయికగా ఫిఫా ప్రపంచకప్ 2026 వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
అంతర్జాతీయ వేదికలపై పెరుగుతున్న క్రేజ్
గతంలో ఖతార్ వేదికగా జరిగిన 2022 ఫిఫా ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ నోరా తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ వంటి ఇతర గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్లలోనూ ఆమె ప్రదర్శన ఇచ్చారు. స్టేజ్ పై ఆమె ఎనర్జీ, మ్యూజిక్, డ్యాన్స్ కలగలిపిన విధానానికి ఉన్న డిమాండ్‌కు ఈ తాజా అవకాశమే నిదర్శనం.






