- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఫిఫా.. ఫుట్‌బాల్ సమాఖ్యపై మరోసారి నిషేధం
పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(పీఎఫ్ఎఫ్)పై ఫిఫా నిషేధం విధించింది.

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌కు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఫిఫా) షాకిచ్చింది. పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(పీఎఫ్ఎఫ్)పై నిషేధం విధించింది. పాక్‌లో క్రీడ సజావుగా, న్యాయబద్దంగా సాగేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను అమలు చేయడంలో విఫలమవడంతో పీఎఫ్‌ఎఫ్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఎఫ్ కాంగ్రెస్ సవరణలను ఆమోదించే వరకూ నిషేధం కొనసాగుతుందని ఫిఫా స్పష్టం చేసింది. పాక్ ఫుట్‌బాల్ 2019 నుంచి ఫిఫా నియమించిన నార్మలైజేషన్ కమిటీ నియంత్రణలో ఉంది. ఎన్నికల నిర్వహణ, ఫెడరేషన్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించడం ఈ కమిటీ బాధ్యత. అయితే, గత ఐదేళ్లలో పలుమార్లు ఈ కమిటీ అధ్యక్షులు, సభ్యులు మారినప్పటికీ పాక్ ఫెడరేషన్‌లో సమస్యలు అలాగే ఉన్నట్టు ఫిఫా గుర్తించింది. అలాగే, రాజ్యాంగ సవరణలను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు ఆమోదించకపోవడంతో ఫిఫా చర్యలకు పూనుకుంది. పాక్ ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కాదు. 2017 నుంచి ఇది మూడోసారి.






