- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాలిబన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోతున్న మహిళా క్రీడాకారిణలు

దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఇకపై అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొనబోతున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడేందుకు అఫ్గాన్ నుంచి వచ్చిన శరణార్థి మహిళా ప్లేయర్లతో ఏర్పడిన అఫ్గాన్ ఉమెన్ యునైటెడ్(ఏఎఫ్‌సీ)కి ఫిఫా కౌన్సిల్ బుధవారం అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్లో మహిళలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఫుట్‌బాల్ క్రీడాకారిణులు అఫ్గాన్‌ను విడిచి ఆస్ట్రేలియాకు వచ్చారు. అయితే, తాలిబన్ ప్రభుత్వం అనుమతి లేకపోయినా అంతర్జాతీయ టోర్నీల్లో అఫ్గాన్ జాతీయ జట్టుగా ఏఎఫ్‌సీ పాల్గొనడానికి ఫిఫా కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఇది చారిత్రాత్మక పాలనా నిర్ణయమని ఫిఫా ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినో తెలిపారు. ‘ప్రపంచ క్రీడలో ఇది శక్తివంతమైన, అపూర్వమైన ముందడుగు. ఫుట్‌బాల్ ఆడేందుకు, తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి బాలికకు, మహిళాకు ఉన్న హక్కును పరిరక్షించడం ఫిఫా బాధ్యత. అందుకే అధికారిక మ్యాచ్‌ల్లో అఫ్గాన్ మహిళలు తమ దేశం తరపున పాల్గొనడానికి అనుమతి ఇచ్చాం.’అని తెలిపారు. జూన్‌లో న్యూజిలాండ్‌లో అఫ్గాన్ జట్టు ట్రైనింగ్ క్యాంప్‌కు ఫిఫా నిధులు సమకూర్చనుంది.






