రోహిత్ పై అభిమానుల బాడీ షేమింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం ఎదురైంది.

రోహిత్ పై అభిమానుల బాడీ షేమింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం ఎదురైంది. సొంత అభిమానులే సోషల్ మీడియాలో తనపై నోరుపారేసుకున్నారు. అసభ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. మూడో టెస్ట్‌లో భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు.. వడాపావ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్‌ను అవమానించడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో మనల్ని మనమే కించపరుచుకోవడమని మండిపడుతున్నారు. మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో కుహ్నేమన్ బౌలింగ్‌లో స్టంపౌటైన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లయన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం మొత్తం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తొలి టెస్ట్‌లో రోహిత్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు సాధించాడు. మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మతో పాటు మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చతేశ్వర్ పుజారా ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. అతనికి అండగా ఎవరూ నిలవలేకపోయారు. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని సహించలేకపోయిన అభిమానులు రోహిత్ శర్మపై నోరు పారేసుకున్నారు.

Next Story