ధోని కోసం ఫ్యాన్ 1,200 కిమీ సైక్లింగ్.. మహిపై నెటిజన్ల విమర్శలు!

by saikumar |   ( Updated:2024-10-01 18:42:58.0  )
ధోని కోసం ఫ్యాన్ 1,200 కిమీ సైక్లింగ్.. మహిపై నెటిజన్ల విమర్శలు!
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తన కెప్టెన్సీ టైంలో భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌ 2007 (టీ20), 2011 (వన్డే)లను అందించాడు. ప్రస్తుతం ధోని అంతర్జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నారు. అయితే, ధోనికి అభిమానుల కొదువ లేదు. తాజాగా ఓ అభిమాని.. పేరు గౌరవ్ కుమార్ ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ నుంచి జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ధోని ఫాంహౌస్‌కు సుమారు 1,200కిమీ సైకిల్ మీద వెళ్లాడు.

ధోని ఫాంహౌస్ ఎదుట టెంట్ వేసుకుని 5 రోజులు అక్కడే వెయిట్ చేశాడు. అయినప్పటికీ ధోని అతన్ని కలువలేదు. దీంతో ఆ అభిమాని చాలా నిరాశకు గురయ్యాడు. ధోని కారులో వెళ్లే టైంలో ఆయన్ను కలిసేందుకు యత్నించినా మహి పట్టించుకోలేదని ఆ అభిమాని నెట్టింట పోస్టు చేయడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, తన అభిమాని పట్ల ధోని ప్రదర్శించిన బిహేవియర్ పై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story