చెలరేగిన భారత బౌలర్లు.. బంగ్లా 5 వికెట్లు డౌన్

by Muthe.Rajitha |

ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా నేడు భాగంగా నేడు బంగ్లాదేశ్-భారత్(Bangla vs Ind) దుబాయ్(Dubai) వేదికగా తలపడుతున్న విషయం తెలిసిందే.

చెలరేగిన భారత బౌలర్లు.. బంగ్లా 5 వికెట్లు డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా నేడు భాగంగా నేడు బంగ్లాదేశ్-భారత్(Bangla vs Ind) దుబాయ్(Dubai) వేదికగా తలపడుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి రాగానే మొదటి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. షమీ(Shami) వేసిన బంతికి సౌమ్యా సర్కార్(Soumya Sarkar) వికెట్ కీపర్ కు దొరికిపోయి, ఔటయ్యాడు. 8 ఓవర్లలో36 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి నిరాశలోకి పడిపోయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన జకేర్ అలీ, తౌహీద్ కుదురుకొని స్కోర్ బోర్డును 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు దాటించారు.

షమీ రెండు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా ఒక వికెట్, అక్షర పటేల్(Axar Patel) వరుస బాల్స్ లో రెండు వికెట్లు తీసి బంగ్లా బౌలర్లను బెంబేలు ఎత్తించాడు. అయితే అదే ఓవర్లో జకేర్ ఇచ్చిన క్యాచ్ రోహిత్ మిస్ చేయడంతో అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అదే విధంగా 19 ఓవర్ వద్ద తౌహీద్ క్యాచ్ ను హర్దీక్ మిస్ చేశాడు. అయితే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలి 20 ఓవర్లలో బంగ్లా 80 పరుగులు దాటలేదు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 41 న ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 176 పరుగుల వద్ద కొనసాగుతోంది. జకేర్, తౌహీద్ లు చెరో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

Next Story