- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి మ్యాచ్ ఆడేసిన కరుణ్?.. ఇక సాయి సుదర్శన్‌కు చాన్స్?
మూడు మ్యాచుల్లో విఫలమైన కరుణ్ నాయర్.. టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడని నిపుణులు అంటున్నారు. మిగతా మ్యాచుల్లో సాయి సుదర్శన్‌కు చాన్స్?

దిశ, స్పోర్ట్స్: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చాడు కరుణ్ నాయర్. దేశవాళీల్లో అద్భుతంగా రాణించడంతోపాటు ‘డియర్ క్రికెట్’ అంటూ క్రికెట్ దేవుళ్లను వేడుకున్నందుకు ఫలితం దక్కి, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన అతను.. అదే జట్టుతో ఐదు టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో జట్టు కాంబినేషన్‌కు కూడా ఉపయోగపడతాడనే ఆలోచనతో నాయర్‌ను టీంమేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. అతను అద్భుతంగా రాణిస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా కోరుకున్నారు. కానీ తనపై ఉన్న అంచనాలన్నింటినీ కరుణ్ తలకిందులు చేశాడు. మూడు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో కరుణ్ కెరీర్ ముగిసిపోనట్లే కనిపిస్తోంది.
దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత కరుణ్ నాయర్‌కు దక్కిన సెకండ్ ఛాన్స్.. కేవలం 25 రోజుల్లోనే ముగిసిపోయినట్లు కనిపిస్తోంది. హెడింగ్లే, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్.. మూడు స్టేడియాల్లో కరుణ్‌కు మంచి ఆరంభాలే దక్కాయి. తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో డకౌట్ అయిన అతను.. ఆ తర్వాత ప్రతి ఇన్నింగ్సులో శుభారంభాలు దక్కించుకున్నాడు. కనీసం 30 బంతులు ఆడాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ ఆరంభాలను మంచి స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్సులో 40 పరుగులు చేసిన తర్వాత వెనుతిరిగాడు. ఇర రెండో ఇన్నింగ్సులో కరుణ్ అవుటైన విధానం అందరికీ గట్టి షాకిచ్చింది. కీలకమైన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను.. కార్సె వేసిన ఇన్‌స్వింగర్‌ను ఏమాత్రం అంచనా వేయలేకపోయాడు. బంతిని లీవ్ చేయగా.. అది అతని ప్యాడ్లను తాకడంతో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.
మూడు టెస్టుల్లో కలిపి ఆరు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన కరుణ్.. 249 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ సుమారు 22 సగటుతో కేవలం 131 పరుగులే చేశాడు. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయాస్ అయ్యర్ వంటి యువకులను పక్కన పెట్టి మరీ అతనిపై టీం మేనేజ్‌మెంట్ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేశాడు. కరుణ్ మినహా జైస్వాల్, రాహుల్, గిల్, పంత్, జడేజా అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కరుణ్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో కరుణ్ తన చివరి మ్యాచ్ ఆడేశాడని నిపుణులు అంటున్నారు. అతని స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడిస్తే.. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవమైనా వస్తుందని చెప్తున్నారు. దానికితోడు హెడింగ్లేలో రెండో ఇన్నింగ్సులో సాయి చక్కగా ఆడాడని, అలాంటి ప్లేయర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.






