ఉత్కంఠకు తెర.. టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

by Malleboina Mahesh |

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ! హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో పటిష్టమైన జట్టును ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఉత్కంఠకు తెర.. టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు (Indian Women's Team) ఎంపికపై బీసీసీఐ (BCCI) ఈ సారి మరింత కసరత్తు చేసింది. ఈ క్రమంలో ఈ రోజు (మే 2న) సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకమైన వీడియో రూపంలో భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు దాదాపు ఉమెన్స్ వరల్డ్ కప్ (Women's World Cup) విజేతలుగా నిలిచిన ప్లేయర్లనే రంగంలోకి దించింది. అలాగే మరికొంత మంది కొత్త ప్లేయర్లకు సైతం జట్టులో అవకాశం కల్పించింది.

బీసీసీఐ ప్రకటన ప్రకారం భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్‌గా వ్వ హరించనుండగా.. స్మృతి మంధాన (Smriti Mandhana) వైస్ కెప్టెన్ గా కొనసాగనుంది. అలాగే షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, భారతి ఫుల్‌మాలి, శ్రీ చరణి, యస్టికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయంకా పాటిల్ భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు.

కెప్టెన్: హర్మన్‌ప్రీత్ కౌర్.

వైస్ కెప్టెన్: స్మృతి మంధాన.

ప్రధాన ఆటగాళ్లు: షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్.

జట్టులోని ఇతర సభ్యులు: భారతి ఫుల్‌మాలి, శ్రీ చరణి, యస్టికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయంకా పాటిల్.

Next Story